Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeసినిమాప్రేమ ప్రయాణాన్ని అందంగా తెలిపే'హే పసి మనసే'

ప్రేమ ప్రయాణాన్ని అందంగా తెలిపే’హే పసి మనసే’

- Advertisement -

దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న పీరియాడికల్‌ మూవీ ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో దుల్కర్‌ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు.
స్పిరిట్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌లపై రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్‌, ప్రశాంత్‌ పొట్లూరి, జోమ్‌ వర్గీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘కాంత’ ఫస్ట్‌ సింగిల్‌ ‘హే పసి మనసే’ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ సాంగ్‌ని వింటేజ్‌ వరల్డ్‌ రోమాన్స్‌ని ప్రజెంట్‌ చేసేలా కంపోజ్‌ చేశారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఝాను చంతర్‌. మెలోడీతో నిండిన ఆ కాలపు మ్యూజిక్‌ ఫీలింగ్‌ని మళ్లీ గుర్తు చేశారు. కష్ణ కాంత్‌ రాసిన లిరిక్స్‌ ప్రేమలోని ప్రయాణాన్ని అందంగా ప్రజెంట్‌ చేస్తే, ప్రదీప్‌ కుమార్‌, ప్రియాంకా ఎన్‌కే వోకల్స్‌ మనసుని హత్తుకున్నాయి. విజువల్స్‌ రెట్రో మ్యూజిక్‌ థీమ్‌కే తగ్గట్టు, అద్భుతమైన సెట్స్‌, కాస్ట్యూమ్స్‌తో వింటేజ్‌ సినిమా వాతావరణాన్ని తెరమీదకు తెచ్చాయి. దుల్కర్‌ సల్మాన్‌, భాగ్యశ్రీ బోర్స్‌ కెమిస్ట్రీ వింటేజ్‌ ప్రేమకథకి రియల్‌ ఫీల్‌ని తీసుకొచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్‌ 12న థియేటర్లలో రిలీజ్‌ కానుంది అని మేకర్స్‌ పేర్కొన్నారు.
‘దుల్కర్‌ సల్మాన్‌ ఎంచుకునే కథలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటిదే ఈ కథ కూడా. ఇందులో ఆయన పాత్ర మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అహంభావం వల్ల గురుశిష్యుల మధ్య జరిగే ఆసక్తికర సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి’ అని దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్‌ చెప్పారు.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ – సాయికష్ణ గద్వాల్‌, సుజరు జేమ్స్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌ – శ్రవణ్‌ పాలపర్తి, డీఓపి – డాని శాంచెజ్‌ లోపెజ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ – తా.రామలింగం, అదనపు స్క్రీన్‌ ప్లే – తమిళ్‌ ప్రభ, సంగీతం – ఝను చంతర్‌, ఎడిటర్‌ – లెవెల్లిన్‌ ఆంథోనీ గోన్సాల్వేస్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad