Tuesday, December 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅలరించే మెలోడీ 'నెలరాజె..'

అలరించే మెలోడీ ‘నెలరాజె..’

- Advertisement -

నేతాజి ప్రొడక్షన్స్‌, జిఎం ఫిల్మ్‌ కార్పోరేషన్‌ బ్యానర్ల మీద రిచర్డ్‌ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ద్రౌపది 2’. మోహన్‌.జి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు. ద్రౌపది పాత్రలోని రక్షణ చంద్రచూడన్‌ ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ రీసెంట్‌గానే విడుదల చేయగా సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నెలరాజె..’ అనే పాటను విడుదల చేశారు.

అమ్మాయి కాబోయే వరుడి మనసులో ఊహించుకుంటూ పాడే పాట అది. జిబ్రాన్‌ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమాలోని ఈ సాంగ్‌ను సామ్రాట్‌ రాయగా, పద్మలత పాడారు. ఈ మెలోడీ ట్యూన్‌, లిరిక్స్‌ అన్నీ హదయానికి హత్తుకునేలా ఉన్నాయి. రిచర్డ్‌ రిషి, రక్షణ ఇందుచూడన్‌, నట్టి నటరాజ్‌, వేల రామమూర్తి, చిరాగ్‌ జాని, దినేష్‌ లాంబా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌ : ఫిలిప్‌ ఆర్‌ సుందర్‌, ఎడిటర్‌ : దేవరాజ్‌ ఎస్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ : ఎస్‌ కే, స్టంట్స్‌ : యాక్షన్‌ సంతోష్‌, డైలాగ్స్‌ : సామ్రాట్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -