Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పార్టీకి కట్టుబడి పని చేయాలి

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పార్టీకి కట్టుబడి పని చేయాలి

- Advertisement -

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు
నవతెలంగాణ – మద్నూర్

సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పార్టీకి కట్టుబడి నాయకులంతా కలిసిమెలిసి పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు గెలిపించాలని మండల పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు తెలియజేశారు. మండలంలోని పెద్ద ఎక్లార గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పార్టీకి కట్టుబడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ ప్రత్యేక సమావేశంలో మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, పెద్ద ఎక్లారా గ్రామ పెద్దలు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు, దేశాయ్, ఆ గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మహేష్ ఆ గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -