- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నూలులో బస్సు దుర్ఘటన మిస్టరీ వీడింది. ఈ ప్రమాదంలపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బైకర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు పలు కోణాల్లో ప్రశ్నించారు. బంక్‌లో పెట్రోల్ పోయించిన తర్వాత శివశంకర్ బైక్ నడిపాడు. బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు కుడిపక్కనున్న డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో శివశంకర్ అక్కడికక్కడే మరణించగా.. వెనకనున్న ఎర్రిస్వామి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలోనే అటువైపుగా వెళ్తున్న వేమూరి కావేరి బస్సు బైక్‌ను ఢీ కొట్టింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో మంటలు చెలరేగి 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
- Advertisement -



