Wednesday, July 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ స్కీమ్‌ రద్దు చేయాలి

నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ స్కీమ్‌ రద్దు చేయాలి

- Advertisement -

– 9న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి : బీడీఎల్‌ వద్ద కార్మికుల గేట్‌ మీటింగ్‌లో జె.వెంకటేశ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేషనల్‌ మానిటైజేషన్‌ పైపులైన్‌ స్కీమ్‌ను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్‌, బీరం మల్లేశ్‌, బీడీఎల్‌ ప్రధాన కార్యదర్శి టి.సత్తయ్య డిమాండ్‌ చేశారు. ఈ నెల తొమ్మిదో తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని బీడీఎల్‌ కార్మికులకు పిలుపునిచ్చారు. సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం బానూరు బీడీఎల్‌ వద్ద గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు. సామాన్యులపై భారాలు మోపి కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయల రాయితీలివ్వడమేంటని ప్రశ్నించారు. బీడీఎల్‌ పరిశ్రమలో ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని పెంచడాన్ని తప్పుబట్టారు. ఎన్‌ఎమ్‌పీ పేరుతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. కార్మికులను కట్టుబానిసలుగా మార్చే లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీడీఎల్‌ యూనియన్‌ నాయకులు దానకర్ణాచారి, కాశీరెడ్డి, వినోద్‌, శ్రీనివాస్‌, ఇతర ఆఫీస్‌ బేరర్లు, ఈసీ మెంబర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -