నవ్య భారతి గ్లోబల్ స్కూల్ చైర్మన్ సంతోష్ కుమార్
నవతెలంగాణ – కంఠేశ్వర్
నవతెలంగాణలో వచ్చే ప్రతి అక్షరం ప్రజలకు ఆయుధంగా ఉంటుందని నవ్య భారతి గ్లోబల్ స్కూల్ చైర్మన్ సంతోష్ కుమార్ అన్నారు. నవతెలంగాణ 10 వార్షికోత్సవం సందర్భంగా ఆయన నవతెలంగాణ ప్రతినిధులతో మాట్లాడారు. నవతెలంగాణ పత్రిక స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిందని పదవ సంవత్సరం అడుగుపెడుతుందని తెలిపారు. 10 ఏళ్ల కాలంలో ప్రజల పక్షాన వారి గొంతుకగా మారి నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ వాటి పరిష్కారం కోసం తమ వంతు పాత్ర పోషిస్తుందన్నారు.
విద్య, వైద్యం, క్రీడలు, కార్మికులు, కర్షకులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం రాజి లేని వార్త కథనాలు అందించినట్లు తెలిపారు. ప్రజల సహకారంతో ప్రజల పక్షాన అక్షరాలు అందిస్తూ వారిలో చైతన్యం తీసుకొస్తుందని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవాని దీక్షతో ప్రజలకు మంచి చేయాలని సంకల్పంతో నవతెలంగాణ పత్రిక ముందుకు వెళుతుందని, భవిష్యత్తులో మరిన్ని ప్రజలకు ఉపయోగపడే కథనాలు అందించి అభివృద్ధి బాటలో ప్రయాణించాలని కోరారు.10 వ వార్షికోత్సవం సందర్భంగా పత్రిక యాజమాన్యానికి విలేకరులకు, సిబ్బందికి, పాఠకులకు శుభాకాంక్షలు తెలిపారు.
నవతెలంగాణ అక్షరం.. ప్రజలకు ఆయుధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES