రాష్ట్ర ఇంధన ప్రిన్స్ పల్ కార్యదర్శి వెనవిన్ మిట్టల్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని కాపురం బ్లాక్-1 ఓపెన్‌కాస్ట్ మైన్ కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. మంగళవారం జెన్కో సీఎండీ హరీష్,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,ఏఎమ్మార్ సిఎండి మహేశ్వర రెడ్డి,సిఈఓ ప్రసాద్,వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, థర్మల్, కోల్ డైరెక్టర్లుతో కలిసి తాడిచర్ల-1 కోల్ బ్లాక్ ఓపెన్‌కాస్ట్ మైన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మైనింగ్ కార్యకలాపాలు, ఉత్పత్తి ప్రక్రియ, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ చర్యలు వంటి అంశాలను పరిశీలించారు. మైనింగ్ ప్రాంతం నుండి తాడిచర్ల గ్రామాన్ని, వాహన ప్రాంగణం, యంత్రాలను,ఫీడర్ బ్రేకర్ పరిశీలించారు.
భూసేకరణకు సంబంధించిన పరిహారం పంపిణీ, పునరావాస చర్యలు వంటి విషయాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏఎమ్మార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.భూసేకరణ,పునరావాస చర్యలు న్యాయబద్ధంగా,పారదర్శకంగా,వేగంగా పూర్తిచేయాలని సూచించారు. అనంతరం తాడిచర్ల నుండి కేటీపీపీ వరకు కన్వేయర్ బెల్ట్ నిర్మాణం,రవాణామార్గం, దూరాబారాలపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.అధికారులు కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, రహదారి మార్గం, భద్రతా చర్యలు మరియు అవసరమైన నిర్వహణ ప్రక్రియపై వివరాలు అందించారు. కన్వేయర్ బెల్ట్ నిర్మాణం పూర్తయితే రహదారి రవాణాపై భారం తగ్గి సమర్థవంతంగా బొగ్గు పంపిణీ జరుగుతుందని తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా రానున్న రోజుల్లో నిరంతరాయ విద్యుత్ సరఫరా జరగాలని ఆయన సూచించారు. కెటిపిపిలో 28 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో థర్మల్ డైరెక్టర్ రాజశేకర్ రెడ్డి, కోల్ డైరెక్టర్ రాగ్యా, విద్యుత్తు శాఖ ఈ డి లక్ష్మయ్య,కెటిపిపి సీఈ శ్రీ ప్రకాష్, ఎస్ ఈ ముత్యాల రావు,అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, విద్యుత్తు శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్, తహసీల్దార్ రవి కుమార్,ఏఎంఆర్ సీనియర్ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తి,జెన్కో జిఎం మోహన్ రావు,ఏఎమ్మార్ అధికారులు, జెన్కో అధికారులు పాల్గొన్నారు.



