- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు ఇమ్మడి గోపి బుధవారం (మార్చి 11) రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. స్వగ్రామానికి వెళ్తుండగా ఇందల్వాయి శివారులో కారుతో ఢీకొట్టి, అనంతరం హతమార్చినట్లు సమాచారం. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అయితే నిందితుడు మృతుడికి సమీప బంధువు మేనల్లుడిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇమ్మడి గోపి ఇందల్వాయి మండలంలో ఎంపీపీగా కూడా సేవలందించారు.
- Advertisement -



