Friday, December 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసరికొత్త'అమర కావ్యం'

సరికొత్త’అమర కావ్యం’

- Advertisement -

ధనుష్‌, కృతి సనన్‌ హీరో, హీరోయిన్లుగా ఆనంద్‌ ఎల్‌.రాయ్ దర్శకత్వంలో భూషణ్‌ కుమార్‌ నిర్మించిన చిత్రం ‘తేరే ఇష్క్‌ మై’కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. ఇప్పటికే సినిమా బాక్సాఫీస్‌ దగ్గర దూసుకెళ్తోంది. ధనుష్‌, కృతి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమాలోని పాత్రలు, వాటి మధ్య ఉన్న ఎమోషన్స్‌, ఎ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం ఇలా అన్నీ కలిసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. దీన్ని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లేలా సినిమా తెలుగు ట్రైలర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. హీరో, హీరోయిన్‌ మధ్య ప్రేమ, కొన్ని పరిస్థితుల్లో హీరో ప్రేమను కోల్పోవటం, ఆ బాధ నుంచి బయటకు రావటం వంటి ఫీలింగ్స్‌ను ట్రైలర్‌లో చాలా చక్కగా చూపించారు. కథలోని డెప్త్‌, ప్రేమలోని తెలియని బాధలను కూడా ప్రేక్షకులు మెచ్చే రీతిలో దర్శకుడు ఆనంద్‌ ఎల్‌.రాయ్ తెరకెక్కించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -