మురళీ మోహన్ ప్రధాన పాత్రలో ఆది అక్షర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సుప్రీమ్ వారియర్స్’. ఈ చిత్రానికి పెదపూడి బాబూ రావు నిర్మాత. హరి చందన్ దర్శకుడు. ఈ మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ధవళ సత్యం, బెల్లంకొండ సురేష్, దర్శకుడు వీర శంకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, శివ రాజ్ పాటిల్, మార్కాపురం శివ కుమార్, శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ధవళ సత్యం, డా.మురళీ మోహన్ గౌరవ దర్శకత్వం వహించారు.
హీరో, నిర్మాత బాబూరావు మాట్లాడుతూ, ‘సైఫై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని నిర్మిస్తున్నాం. ఇందులో సౌత్ నుంచి నార్త్ వరకు మంచి పేరున్న హీరోల్ని తీసుకుంటున్నాం. అలాగే నేను ఓ లీడ్ పాత్రలో కనిపిస్తాను’ అని అన్నారు.
‘8 పాత్రల చుట్టూ జరిగే ఈ కథలో మురళీ మోహన్ ఇది వరకు ఎన్నడూ కనిపించనటు వంటి కారెక్టర్‌ను పోషిస్తున్నారు. మిలటరీ, ఆర్మీ కుటుంబాల ఎమోషన్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. దీని కోసమే మేం 800 మంది ఆర్మీ కుటుంబాలను కలిశాం’ అని దర్శకుడు హరి చందన్ చెప్పారు.
సరికొత్తగా ‘సుప్రీమ్ వారియర్స్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES