బీఎస్‌ఎన్‌ఎల్ పరిరక్షణ కోసం ఉద్యమించాలి
జులై 9 సమ్మెలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు పాల్గొనాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ స్కీమ్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలనీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టే నిర్ణయాన్ని విడనాడాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ డిమాండ్ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ పరిరక్షణ కోసం ఆ సంస్థ ఉద్యోగులంతా జులై 9 సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నర్సింగరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జె.వెంకటేశ్ మాట్లాడుతూ..వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలం నుంచే ఎంటిఎల్‌ఎన్‌ను, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్‌ను ధ్వంసం చేయడం ప్రారంభమైంద ని విమర్శించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ 11 ఏండ్లుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ను మరింత బలహీనపర్చిందని వాపోయారు. దేశంలోని 242 ప్రభుత్వరంగ సంస్థల్లో అత్యధిక సంస్థలు బీజేపీ కాలంలోనే బలహీనపడ్డాయని ఉదహరణలతో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనీ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు, అసంఘటితరంగ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ హైదరాబాద్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్ మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్ యాజమాన్యం తెలంగాణ సర్కిల్‌లోని ఉద్యోగుల హక్కులను హరిస్తున్నదనీ, ఈ చర్యలు మానుకోవాలని కోరారు. 2017 నుంచి పెండింగులో ఉన్న వేజు రివిజన్ సాధన కోసం బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎన్‌ఎమ్‌పీ పథకాన్ని రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES