నవతెలంగాణ-హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ్టితో (డిసెంబర్ 05) నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మూడో దశ నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఆఖరిరోజు నామినేషన్లు స్వీకరించారు ఎన్నికల అధికారులు. చివరి రోజు కావడంతో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది.సాయంత్రం 5 గంటల వరకే నామినేషన్లు స్వీకరించాల్సి ఉన్నా.. ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో కేంద్రాలన్ని కిటకిటలాడాయి. గడువు లోను నామినేషన్ కేంద్రాలలోకి వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చి ఆలస్యంగానైనా నామినేషన్లను స్వీకరించారు అధికారులు.
మూడో విడతలో మొత్ం182 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా 4 వేల159 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేశారు. శనివారం (డిసెంబర్ 06) మూడో దశ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 9న ఉపసంహరణ ఉంటుంది.



