Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి 

లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి 

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్లకు ఊడిగం చేసేలా నాలుగు లేబర్ కోడ్ లు తీసుకువచ్చి వాటి అమలుకు జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని ఈదులూరు క్రాస్ రోడ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోన్న అంజయ్య, మండల సమన్వయ కమిటీ కన్వీనర్ చెరుకు జానకి మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా విధానాలను మారుస్తూ, అసంఘటిత రంగ కార్మికుల హక్కులను హరిస్తుందని అన్నారు.

లేబర్ కోడ్ వేతనాలు అనే పదానికి కొత్త నిర్వచనాన్ని తీసుకువస్తూ బోనసు ఇంటి అద్దెఅలవెన్సు రవాణా అలవెన్స్లు కార్మికుల వేతనాలలో 50 శాతానికి మించరాదనేవి షరతులుతెచ్చి కార్మికుల హక్కులను కాల రాస్తుందన్నారు. స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత సామాజిక భద్రత లేకుండా పోయిందన్నారు. కార్మిక చట్టాలను మార్చొద్దు, కార్మికుల హక్కులను కాలరాయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. కార్యక్రమంలో సిఐటియు కట్టంగూరు మండల సమన్వయ కమిటీ సభ్యులు కత్తుల రామలింగయ్య, సైదులు, లక్ష్మి, యాదమ్మ, గిరి, అశోక్ ,శంకర్ ,లింగయ్య ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -