వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్రమోహన్
విత్తన ధ్రువీకరణ అధికారుల అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రైజింగ్ 2047కు అనుగుణంగా రాష్ట్రం నుంచి ఓఈసీడీ విత్తన ఎగుమతులు, సేంద్రీయ ధ్రువీకరణను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో విత్తన ధ్రువీకరణ అధికారుల అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను విత్తన ధ్రువీకరణ అథారిటీ డైరెక్టర్ డాక్టర్ గోపితో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం విత్తన ఎగుమతుల ధ్రువీకరణ, సేంద్రీయ ధ్రువీకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులకు ధ్రువీ కరణ సేవలు అందించాలనీ, ఆర్గానిక్ సర్టిఫికేషన్‌పైన రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పైన వినియోగదారులకు కూడా అవగాహన కల్పించారు. అదేవిధంగా, తెలంగాణ రైజింగ్ 2047కు అనుగుణంగా రాష్ట్రంలో ఓఈసీడీ విత్తన ఎగుమతులను మరింత పెంచేందుకు తగిన ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. తెలంగాణలో విత్తన ఎగుమతులకు మంచి అవకాశాలున్నాయని చెప్పారు.
ఓఈసీడీ విత్తన ఎగుమతులు, సేంద్రీయ ధ్రువీకరణను ప్రోత్సహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



