నవతెలంగాణ – కంఠేశ్వర్
2003 ఉద్యోగ ఉపాధ్యాయుల కు కోర్టు తీర్పును అమలు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ సచివాలయం లో 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ అమలు తేదీ 01.09.2004 కు ముందు నియామక నోటిఫికేషన్ లు విడుదలై 01.09.2004 తరువాత ప్రభుత్వం ఆలస్యం కారణంగా, నియామకం జరిగి సిపిఎస్ విధానంలో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి అని గతంలో కూడా కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఇవ్వడం జరిగింది.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా 3 నెలలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. కావున 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్షి రామకృష్ణారావు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మాడవేడి వినోద్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు, ఇమ్మడి సంతోష్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్షి, గుంటి వేణుగోపాల్ రాష్ట్ర కోశాధికారి మరియు రాష్ట్ర నాయకులు అంబెల్లి శంకర్, యు. విజయ్ కుమార్, మాణిక్యం, వేణు మాధవ్, జమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES