Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

- Advertisement -

– ఉద్యోగుల జేఏసీ చైర్మెన్‌ లచ్చిరెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రభుత్వ ఉద్యోగులందరికి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మెన్‌ వి.లచ్చిరెడ్డి డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ ఒకటిన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆత్మగౌరవ సభ సన్నాహక సమావేశం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. 37 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ పాత పెన్షన్‌ స్థానంలో సీపీఎస్‌ పెన్షన్‌ తీసుకువచ్చిన ప్రభుత్వం, తాజాగా యూపీఎస్‌ పెన్షన్‌ స్కీమ్‌ ను అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ప్రభుత్వం పరోక్షంగా సీపీఎస్‌ పెన్షన్‌ స్కీమ్‌లో లోపాలున్నాయని ఒప్పుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ పోరాడితే మళ్ళీ పాత పెన్షన్‌ విధానం అమలులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. సీపీఎస్‌ ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు వేల సంఖ్యలో ఉద్యోగులు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షులు దర్శన్‌ గౌడ్‌ , జేఏసీ కో- ఛైర్మన్లు కె. రామకృష్ణ, ఎస్‌. రాములు, నాయకులు కె.హన్మంత్‌ రావు, దేవేందర్‌, జి.కృపాకర్‌, కె.రాములు, బాణాల రాంరెడ్డి, డా.జి. నిర్మల, అశ్వధామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad