Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలి...

ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలి…

- Advertisement -

నవతెలంగాణ – హాలియా
2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు కాంట్రీ బ్యూటరి పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేశ్ అన్నారు. ఆదివారం హలియలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమించిన ఈ విధానాన్ని ఉద్యోగులకు తీసుకురావడం దుదృష్టకరం అన్నారు. దీని వల్ల ఎంతో మంది సిపిఎస్ ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయి అన్నారు.ఉద్యోగుల బ్రతుకులు షేర్ మార్కెట్ పాలు చెసిన ఈ విధానాన్ని తక్షణమే ఎత్తి వేయాలని అన్నారు. సిపిఎస్ విధానానికి ప్రత్యామ్నాయంగా యుపిఎస్,జీపీఎస్  భిన్నమైన విధానాలు తీసుకు కు వస్తుంది అన్నారు.దీనికి పాత పెన్షన్ విధానం ఒక్కటే న్యాయం చేస్తుందని అన్నారు.30 ఏళ్ల పై గా ప్రభుత్వ సేవలు అందిస్తున్న  ఉద్యోగుల కు పెన్షన్ హక్కు అన్నారు.  పెండింగ్ బిల్లులను కొంత చెల్లించడం హర్షణీయం అన్నారు.కానీ మిగిలిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు.ఎన్నికల ముందు ప్రభుత్వం చేసిన వాగ్దానం మేరకు పెండింగ్ డీఏ లు చెల్లించి పి ఆర్ సి ఇవ్వాలని అన్నారు..ఈ కార్యక్రమం లో  ఉపాధ్యాయులు తదితరులు, పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు గణపురం  నిరంజన్,నరం దాస్ దుర్గా ప్రసాద్,మన్నెం వెంకటేశ్వర్లు, వెంకన్న యాదవ్ తీరం దాస్ రవి,రహీం,అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad