Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుకొనసాగుతున్న ఎరువుల సంక్షోభం..

కొనసాగుతున్న ఎరువుల సంక్షోభం..

- Advertisement -

యూరియా కోసం బారులు తీరిన రైతులు
పలుచోట్ల ధర్నాలు.. రాస్తారోకోలు
నవతెలంగాణ- తుంగతుర్తి
యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. రాత్రనకా.. పగలనకా.. విక్రయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు అదును దాటుతుండటం, మరోవైపు యూరియా దొరకకపోవడం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. మొన్నటి వరకు ఓపిగ్గా బస్తాల కోసం బారులు తీరిన రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఓపిక నశించిన రైతులు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు.

వ్యవసాయ పనులు మానుకొని రైతులు, ఇంటి పనులు మానుకొని మహిళలు, పాఠశాలలకు వెళ్లకుండా విద్యార్థులు ఆయా కేంద్రాల వద్ద క్యూలో పడిగాపులు కాస్తున్నారు. పలుచోట్ల తొక్కిసలాటలు, తోపులాటలు జరుగుతున్నాయి. వర్షాలు పడుతున్నా లెక్కచేయకుండా తడుస్తూ క్యూలో పడిగాపులు పడుతున్నారు. రోజంతా లైన్‌లో ఉన్నా యూరియా బస్తా దొరకని వారు నిరాశతో వెనుదిరిగిపోతున్నారు.

యూరియా కోసం రైతులు బుధవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో మెయిన్ రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేశారు. గతకొన్ని వారాలుగా యూరియా కోసం తెల్లవారుజామున నుండి రాత్రి వరకు ఎదురుచూసినా దొరకడం లేదని ఆరోపిస్తూ రైతులు మెయిన్ రోడ్డుపై ధర్నా చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారించే ప్రయత్నం చేసిన సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన విరమించేది లేదు అని భీష్మించి కూర్చున్నారు.

గంటసేపు ఆందోళన కొనసాగింది. ఏ డి ఏ ఎల్ రమేష్ బాబు సంఘటనా స్థలానికి చేరుకొని రేపటిలోగా యూరియాను అందుబాటులోకి తెస్తాము అని, ధర్నా చేస్తున్న రైతులకు టోకెన్లు ఇచ్చి ఆందోళన విరమింప చేశారు. దాదాపు గంట పాటు రాకపోకలు నిలిచిపోవడంతో వాహన చోదకులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad