ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై పోప్ లియో
తొలి విదేశీ పర్యటనలో కీలక వ్యాఖ్యలు
ఇస్తాంబుల్-బీరుట్ : పోప్ లియో 14 తన మొదటి విదేశీ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్-పాలస్తీనా ఘర్షణకు టూ స్టేట్ సొల్యూషన్ (రెండు దేశాల ఏర్పాటు) మాత్రమే న్యాయం చేయగలదని అన్నారు. ఇస్తాంబుల్ నుంచి బీరూట్‌కు వెళ్తున్న విమానంలో జర్నలిస్టులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఆయన పోప్‌గా ఇచ్చిన మొదటి అధికారిక ‘ఎయిర్‌బోర్న్’ ప్రెస్ కాన్ఫరెన్స్. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్‌తో జరిగిన వ్యక్తిగత చర్చల్లో గాజా యుద్ధం, ఉక్రెయిన్-రష్యా వార్ గురించి మాట్లాడినట్టు చెప్పారు. ”గాజా-ఇజ్రాయిల్ సమస్యకు ‘టూ స్టేట్ సొల్యూషన్’ మాత్రమే మార్గం. ఇజ్రాయిల్ ఈ పరిష్కారాన్ని అంగీకరించకపోయినా అదే అక్కడి ప్రజలకు న్యాయం చేస్తుంది” అని పోప్ అన్నారు.
రెండు దేశాల ఏర్పాటే ఏకైక మార్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



