నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజా సమస్యలు పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఇచ్చే పిలుపులు ను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య మండల కమిటీ సభ్యులకు సూచించారు. పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు ముల్లగిరి గంగరాజు అద్యక్షతన బుధవారం స్థానిక పార్టీ కార్యాలయం సుందరయ్య భవన్ లో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రభుత్వ పధకాల అమలు తీరు,వీటి లబ్ధిదారులు అర్హులే నా అంశాలను ప్రభుత్వాధికారులు – ప్రజలకు సమన్వయంగా కార్యకర్తలు విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకి కమిటీ సభ్యులు చిరంజీవి,మండల కార్యదర్శి సోడెం ప్రసాద్,మండల కార్యదర్శి వర్గం సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ పిలుపును విజయవంతం చేయాలి: సీపీఐ(ఎం) నేత పుల్లయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



