Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్బీసీ బిల్లు ఆమోదం చారిత్రాత్మక విజయం

బీసీ బిల్లు ఆమోదం చారిత్రాత్మక విజయం

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల : పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడంపై సిరిసిల్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేసిందని వారు పేర్కొన్నారు. శాసనసభలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంబరాలు జరుపుకున్నారు.

టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. బీసీలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ముందుకు వెళుతుంటే బిఆర్ఎస్, బిజెపి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని గతంలో బీసీ బిల్లు ఆర్డినెన్స్ను అడ్డుకున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గడ్డం నరసయ్య, బొప్ప దేవయ్య, ఎళ్లే లక్ష్మీనారాయణ, కల్లూరు చందన, ఆడెపు చంద్రకళ, సుర దేవరాజు, ఆకునూరి బాలరాజు, గోలి వెంకటరమణ, గోనె ఎల్లప్ప, బొద్దుల శ్రీనివాస్, అడ్డగట్ల శంకర్, నేరళ్ల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad