ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్..
ఎస్సై గొల్లపల్లి అనూష..
నవతెలంగాణ – జన్నారం
కాలాన్ని, ధనాన్ని వృథా చేసుకోవడం కంటే, సామరస్యం తొ నిండిన రాజీ మార్గమే అత్యుత్తమం. రాజీ మార్గమే రాజమార్గం అని జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష అన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ.. ఈ నెల 15వ తారీఖున తలపెట్టిన ప్రత్యేక లోక్ అదాలత్ ను జన్నారం మండల పరిధిలోని పౌరులందరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలని వారు ప్రత్యేకంగా కోరారు. లోక్ అదాలత్ అనేది కేసుల పరిష్కారానికి ఒక అద్భుతమైన వేదిక అన్నారు. క్షణికావేశంలో నమోదు చేసుకున్న చిన్న చిన్న కేసులు, అలాగే కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, చెక్ బౌన్స్, చిన్నపాటి సివిల్ తగాదాలు వంటి రాజీ పడుటకు అవకాశం ఉన్న కేసులను న్యాయస్థానం పరిధిలో స్వచ్ఛందంగా రాజీ కుదుర్చుకోవడం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చు అన్నారు.
ఈ ప్రక్రియ ద్వారా న్యాయం తక్కువ సమయంలో లభించడమే కాకుండా, ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదిరి, సంబంధాలు శాశ్వతంగా మెరుగుపడతాయి అన్నారు. న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ, ఖర్చు పూర్తిగా ఆదా అవుతుందన్నారు. ఈ మహత్తర అవకాశాన్నిజన్నారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రజలు ఈ లోక్ అదాలత్‌లో పాల్గొని, తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకొని, న్యాయం పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.
రాజీమార్గమే రాజమార్గం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



