• నేడు జాతీయ లోక్ అధాలత్
నవతెలంగాణ – పెద్దవంగర
రాజీ మార్గమే రాజ మార్గమని, కక్షిదారులు సత్వర న్యాయం కోసం జాతీయ లోక్ అధాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తొర్రూరు న్యాయస్థాన ప్రాంగణంలో నేడు జాతీయ లోక్ అధాలత్ నిర్వహిస్తారని తెలిపారు. రాజీ పద్ధతిలో కాదలిచిన క్రిమినల్, అన్ని రకాల సివిల్ కేసులు జాతీయ లోక్ అధాలత్ లో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. లోక్ అధాలత్‌లో కేసులను పరిష్కరించుకుని తమ సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని ప్రజలకు సూచించారు. వివిధ కారణాలతో గాయపడి లోక్ అధాలత్‌కు రాలేని కక్షిదారులు కూడా ఆన్‌లైన్‌లో మాట్లాడి రాజీ కుదుర్చుకోవడం ద్వారా పెండింగ్ లో ఉన్న పలు కేసులను పరిష్కరించుకోవచ్చునని పేర్కొన్నారు.
రాజీ మార్గమే రాజ మార్గం: ఎస్సై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



