అచ్చ కమలాకర్ ఎస్సై పసర
నవతెలంగాణ – గోవిందరావుపేట
ఎవరు కూడాచేపల వేటకు వెళ్ళవద్దు. మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ప్రహిస్తున్నాయని, గుండ్ల వాగు ప్రాజెక్టు లోకి 25 అడుగులు గల నీటి సామర్థ్యం కి వరద నీరు వచ్చి చేరి మత్తడి పడుతుంది. ప్రవాహం పెరుగుతుండడంతో ముంపు ప్రాంత ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా చేపల వేట కి వెళ్ళద్దు, వర్షం తగ్గే వరకు పశువులని, మేకలని ఇంటి దగ్గరే మేపుకోవాలని పస్రా ఎస్సై కమలాకర్ అన్నారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి , అత్యవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలి. ముంపు ప్రాంత ప్రజలు ప్రమాదం అనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా పస్రా పోలీస్ స్టేషన్ నంబర్స్ 8712670085, 8712670086 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని లేదా ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు.
ముంపు ప్రాంత ప్రజల అప్రమంతంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES