నవతెలంగాణ – పెద్దవూర
రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెపుతారని మాజీ ఎంపీపి చెన్ను అనురాధ సుందర్ రెడ్డి, మండల అధ్యక్షులు జాటావత్ రవి నాయక్ అన్నారు. సోమవారంమండలంలోని కుంకుడుచెట్టు తండా గ్రామపంచాయతీలో ముఖ్య కార్యకర్తల సమావేశంలోపాల్గొని మాట్లాడారు. సంపన్న వర్గాలకు కొమ్ముగాస్తున్న ఈ దివాలాకోరు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఎన్నికల ఇచ్చిన హామీలు అమలు చేయకుండ, మాది ప్రజా పరిపాలనఅని అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
పక్కన కృష్ణమ్మ ఉన్నప్పటికీ ఈ ప్రాంత వాసులకు సాగునీరు,తాగునీరు కరువైన దుస్థితి ఈ పాలకులు కనబడటం లేదా అని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ చేపట్టిన వరద కాలువను కేసీఆర్ సీఎం అయ్యాక పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. మోటర్ కాలిపోతే చేయలేనటువంటి అద్వాన స్థితిలో ఈ పాలకులు ఉన్నారంటే అని ప్రఅది ప్రజలే ఆలోచన చేయాలని అన్నారు. నెల్లికలు లిఫ్ట్ ఆయకట్టు సాగు గతంలో 6000 ఎకరాల వరకు ఉండగా, దానిని మాజీ సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఈ ప్రాంత గిరిజన అభివృద్ధికై 25 వేల ఎకరాలకు పెంచిన సంగతి గుర్తు చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సత్వరమే పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ ఈ ప్రాంత గిరిజన నోట్లో మట్టి కొడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా అండగా ఉండి సర్పంచులు,ఎంపీటీసీ స్థానాలు గెలిపించాలని వారు పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి పొదిల శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షులు మాజీ, సర్పంచ్ మెండే సైదులు యాదవ్, శ్రీకర్ నాయక్, రవి నాయక్,గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటయ్య,రామావత్ రాజేష్ నాయక్, బాలు నాయక్, శ్రీను నాయక్, రామావత్ లచ్చు నాయక్, ప్రసాద్ నాయక్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కు ప్రజలే తగిన బుద్ది చెబుతారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES