- Advertisement -
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
అగ్ని ధార కురిపించిన కవి యోధుడు దాశరతి, కవి యోధుడు దాశరతి అని తెలంగాణ రచయతల వేదిక జిల్లా అధ్యక్షులు ప్రేమ్ లాల్ అన్నారు. నగరంలోని తెలంగాణ రచయతల వేదిక కార్యాలయం లో మంగళవారం కవి యోధుడు దాశరతి జయంతి సందర్బంగా అయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం పరితపించిన గొప్ప రచయత అని అనేక పాటలు కవితలు రాసిన యోధుడు అని తెలంగాణ రచయతల వేదిక జిల్లా అధ్యక్షులు ప్రేమ్ లాల్ అన్నారు. ఈ కార్యక్రమం లో వేముల శెకర్, ప్రకాష్, మురళి పాల్గొన్నారు.
- Advertisement -