జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్..
నవతెలంగాణ -సూర్యాపేట కలెక్టరేట్
ప్రజావాణి దరఖాస్తులు చాలా శాఖలలో పెండింగ్లో ఉన్నాయని అట్టి పెండింగ్ శాఖల యొక్క జాబితాను ప్రజావాణి గ్రూపులో చేర్చడం జరుగుతుందని, అక్టోబర్ నెలలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు తక్కువగా ఉన్నాయని, అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజలనుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు చాలా శాఖలలో పెండింగ్ లో ఉన్నాయని, అట్టి శాఖల యొక్క వివరాలను ప్రజావాణి గ్రూపులో చేర్చడం జరుగుతుందని, పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, చాలా శాఖలలో అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయటం లేదని , అక్టోబర్ లో క్షేత్రస్థాయి పర్యటన జరిపిన వివరాల రిపోర్టు సమర్పించాలని అన్నారు.
హుజూర్నగర్ లో అక్టోబర్ 25న జరిగిన మెగా జాబ్ మేళాను విజయవంతం చేసిన జిల్లా అధికారులకు పేరు పేరున అభినందనలు తెలుపుతున్నానని జిల్లా అధికారుల కృషి ఫలితంగానే జాబ్ మేళా విజయవంతమైనదని మెగా జాబ్ మేళా విజయవంతంలో డి ఆర్ డి ఏ, ఇండస్ట్రీస్, ఆర్డీవో హుజూర్నగర్, ఆర్డిఓ కోదాడ, హుజుర్నగర్ మున్సిపాలిటీ, ఫైర్ శాఖ, జిల్లా ఆడిట్, మత్స్యశాఖ, ఫారెస్ట్, డిటిడిఓ, ఎంప్లాయిమెంట్ శాఖలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. డిఆర్డిఏ పిడి వివి అప్పారావుకు, జిల్లా ఇండస్ట్రీస్ అధికారి సీతారాం నాయక్ కు, షెడ్యూల్ తెగల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కు కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేశారు.ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబంధించి 19 దరఖాస్తులు,ఎంపిడిఓ లకి 4, డి పి ఓ కి 2, మిగిలిన 42 దరఖాస్తులు ఇతర శాఖలకి సంబంధించి వచ్చాయని మొత్తం 67 ధరఖాస్తులు వచ్చాయని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకి పంపించటం జరిగిందని వాటిని వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.డిఆర్ డిఎ పిడి వివి అప్పారావు,డి పి ఒ యాదగిరి, డి ఇ ఓ అశోక్, సంక్షేమ అధికారులు నరసింహారావు, శంకర్, శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డి శ్రీనివాస్, హౌజింగ్ పీడీ సిద్ధార్థ, జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



