Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంప్రధాని వ్యాఖ్యలు సిగ్గుచేటు

ప్రధాని వ్యాఖ్యలు సిగ్గుచేటు

- Advertisement -

మన అమరవీరుల జ్ఞాపకాలను అగౌరవపరచడమే
మోడీ ప్రసంగంపై సీపీఐ(ఎం) విమర్శ
న్యూఢిల్లీ :
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను పొగడ్తల్లో ముంచెత్తడం తీవ్ర విచారకరమని సీపీఐ(ఎం) శుక్రవారం పేర్కొంది. కపటపూరితమైన చారిత్రక రికార్డు కలిగిన సంస్థ అదని వ్యాఖ్యానించింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ శుభాకాంక్షలు తెలియజేేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్టు పెట్టారు. మహాత్మా గాంధీ హత్యానంతరం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌)ను నిషేధించారని, మతోన్మాద అల్లర్లు రెచ్చగొట్టడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్రను చరిత్రకారులు డాక్యుమెంట్‌గా నమోదు చేశారని బేబీ ఆ పోస్టులో పేర్కొన్నారు. ‘వలస పాలన నుంచి స్వేచ్ఛాస్వాతంత్య్రాల వరకు భారతదేశ ప్రయాణం చాలా సుదీర్ఘమైనది, కఠినమైనది. షహీద్‌ భగత్‌ సింగ్‌, అషఫకుల్లా ఖాన్‌ వంటి అమరవీరులు మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు’ అని బేబీ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. ‘మహాత్మాగాంధీ నుంచి సుభాష్‌ చంద్రబోస్‌, మౌలానా అబుల్‌ కలామ్‌ అజాద్‌ నుంచి కామ్రేడ్‌ పి.కృష్ణపిళ్ళై, ఈఎంఎస్‌, ఏకేజీ, అక్కమ్మ చెరియన్‌ వరకు ఇలా లెక్కలేనంతమంది సాగించిన నిస్వార్ధ పోరాటాలు మన స్వాతంత్య్రానికి చక్కని పునాదిని వేశాయని ఆయన అన్నారు. కానీ ప్రధాని తన ప్రసంగంలో కపటపూరితమైన చారిత్రక రికార్డును కలిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశంసించడం ద్వారా మన అమరవీరుల జ్ఞాపకాలను, మన స్వాతంత్య్ర ఉద్యమస్ఫూర్తిని అగౌరవపరిచారని విమర్శించారు. ఇది ఎంత మాత్రమూ ఆమోద యోగ్యం కానిదన్నారు. పైగా సిగ్గుచేటైన అంశ మన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటాల్లో ఆర్‌ఎస్‌ ఎస్‌కు ఎలాంటి పాత్ర లేదని, పైగా మతపరమైన కారణాలతో దేశ ఐక్యతను దెబ్బతీయడానికి నిరంతరంగా ప్రయత్నించిందని బేబీ విమర్శించారు. న

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad