– ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలి.
– ఉస్మానియా విశ్వవిద్యాలయం పార్ట్ టైం అధ్యక్షులు బోనకుర్తి సోమేశ్వర్.
నవతెలంగాణ-సిటీబ్యూరో : ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పని చేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని ఓయూ పార్ట్ టైం టెక్స్చరర్ అధ్యక్షులు బోనకుర్తి సోమేశ్వర్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు క్యాంపన్కు రానున్న నేపథ్యంలో ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పలు కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఆశీస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలనీ, ఫ్యాకల్ట్ళీ స్థాయిని అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టుగా అప్ గ్రేడ్ చేయాలనీ, వేతనాలు, ఇతర ఉద్యోగ భద్రత విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ చూపుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఓయూలో 250కి పైగా పాట్ టైం అధ్యాపకులు పని చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా 2వేల మంది పైగా పని చేస్తున్నారు. అధ్యాపకులకు గౌరవ వేతనం ఇవ్వడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని తెలిపారు. ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో పార్ట్ టైం ఫ్యాకల్టీ గురించి రాసుకున్న వాగ్దానాలను తిరిగి చూసుకుని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్ట్ టైం లెక్చరర్ల వేదన, సమస్యలు ఎప్పటికప్పుడు నిరాశాజనకంగా చీకటిలోనే మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక నిర్మాణాలతోపాటు నిజమైన అభివృద్ధి అంటే పాఠం చెప్పే అధ్యాపకులను వెట్టి కార్మికులుగా కాకుండా వర్శిటీలో గౌరవ వేతనంతో సమ న్యాయం చేకూర్చాలని కోరారు.
పార్ట్ టైం ఫ్యాకల్టీ పర్మనెంట్ టెక్చరర్లకు ఏ మాత్రం తగ్గకుండా కొన్నిసార్లు కొరత ఉన్నా ఫ్యాకల్టీ డిపార్టుమెంట్లో ఒక సీనియర్ ప్రొఫెసర్ లా పని చేస్తూ ఉన్నా, ఉద్యోగ భద్రత లేదనీ, సెలవులు లేవనీ, కొన్ని నెలలుగా వేతనాలు రావనీ, మెడికల్, పెన్షన్ సదుపాయాలేవీ ఉండవు సరి కదా వారు కెరీరిలో అప్గ్రేడ్ అవ్వడానికి రెగ్యులర్ పాకల్టీకి ఉన్న ఫెసిలిటీస్ లో 10శాతం కూడా ఉండదని తెలిపారు గెస్ట్ అధ్యాపకుల పనికి, పారాలకు సరిపడే గౌరవం, వేతనాలకు స్థిరత్వం ఊనట లభించడం లేదని తెలిపారు. వీసీ, విభాగాధిపతులు కొంత చోటు కల్పించినా, ప్రభుత్వ స్థాయిలో ఎలాంది సంకల్పం లేకపోవడం. బాధాకరం అని తెలిపారు. ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వ పెద్దలు, మేధావులు పార్ట్ టైం లెక్చరర్ల -సమస్యలను విచారించి, ధృడమైన నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ విద్యారంగానికి, ఓయూ ప్రగతికి రాబోయే తరాల స్ఫూర్తికి సరైన మార్గం చూపినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు
పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES