రాష్ట్ర ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి,డిసిసి అధ్యక్షుడు బట్టు కరుణాకర్
నవతెలంగాణ – మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచెర్లలోని దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమస్యలు పరిస్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ బలపర్షిన తాడిచెర్ల సర్పంచ్ అభ్యర్థి బండి స్వామి ఫుట్ బాల్ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి,డిసిసి అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఓటర్లను అభ్యర్దిoచారు.బండి స్వామి పక్షాన ఆదివారం విస్తృతంగా ప్రచారం చేపట్టారు.తాడిచెర్లలో గత కొన్నేళ్లుగా పేరుకపోయిన సమస్యలు పరిస్కారం కావాలంటే అది రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుతోనే సాధ్యమన్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ రాష్టానికి పెట్టుబడులు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు దుద్దిళ్ల అన్నారు.ఆయన ఆదేశాలతో తాడిచెర్ల సర్పంచ్ గా బండి స్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఓసిపికి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్ల సేకరణ,అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ పథకాల తోపాటు గ్రామంలో ఉన్న పలు సమస్యలను పరిస్కారం అయ్యేలా చేస్తాన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు



