Saturday, January 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగురుకుల వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

గురుకుల వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

తెలంగాణ ఇండియన్‌ మెడిసిన్‌ డాక్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గురుకుల వైద్య సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఇండియన్‌ మెడిసిన్‌ డాక్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కోరింది. ఈ మేరకు అసోసియేషన్‌ అధ్యక్షలు డాక్టర్‌ పి.సత్యం, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బి.ఆంజనేయులు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ కార్యదర్శి కృష్ణ ఆదిత్యకు వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆయన కృష్ణ ఆదిత్య వివిధ యూనియన్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా యూనియన్ల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ నేపథ్యంలో డాక్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గురుకులాల్లో వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బందికి పే స్కేల్‌, ట్రాన్స్‌ఫర్స్‌, పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 600 మంది విద్యార్థులతో ఒక్కో గురుకులం ఒక గ్రామంతో సమానమని తెలిపారు.

ప్రతి గురుకులానికి రెండో పోస్ట్‌గా హెల్త్‌ అసిస్టెంట్‌ను యంపీహెచ్‌డబ్ల్యూ, ఏఎన్‌ఎం అర్హతతో తీసుకోవాలని కోరారు. డాక్టర్లకు 2010లో తీసేసిన మెడికల్‌ ఆఫీసర్‌ హౌదాను పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశారు. వైద్యారోగ్యశాఖలో నర్సుల హౌదాను నర్సింగ్‌ ఆఫీసర్‌గా మార్చినట్టుగానే సోషల్‌ వెల్ఫేర్‌లోనూ మార్చాలని సూచించారు. 2017లో ఇన్‌సర్వీస్‌ కోటాలో అర్హత సాధించిన మేల్‌ డాక్టర్లకు డిగ్రీ కాలేజీల్లో పదోన్నతులు కల్పిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ హెడ్డాఫీస్‌ హెల్త్‌ కమాండ్‌ సెంటర్‌లో లేదా జోనల్‌ కార్యాలయాల్లో నియమించాలని వారు విన్నవించారు. హెల్త్‌ కమాండ్‌ సెంటర్‌లో సీనియర్లకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. డాక్టర్ల సేవలను మొత్తం ఐదు గురుకుల సొసైటీల్లో ఉపయోగించుకోవాలనీ, లేనిపక్షంలో ఆయుష్‌లో విలీనం చేయాలని కోరారు. హెల్త్‌ సూపర్‌ వైజర్‌, స్టాఫ్‌ నర్సులకు గ్రేడ్‌ -1, గ్రేడ్‌ -2 పదోన్నతులు కల్పించాలనీ, ప్రతి నెల మెడికల్‌ బడ్జెట్‌ను పెంచాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -