Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్నికల ముందు గొర్ల కాపరులకు ఇచ్చిన హామీని అమలు చేయాలి       

ఎన్నికల ముందు గొర్ల కాపరులకు ఇచ్చిన హామీని అమలు చేయాలి       

- Advertisement -

నవతెలంగాణ – పరకాల       
గొర్రెలు మేకల పెంపకం దారులకు(గొల్లకురుమలకు) ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసి గొర్రెలు మేకల పెంపకం దారులకు న్యాయం చేయాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడబోయిన లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. 

ఈరోజు గొర్రెల మేకల పెంపకం దాక సంఘం పరకాల మండల కమిటీ సమావేశం అల్లి రామకుమురు అధ్యక్షతన అమరధామంలో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా లింగయ్య హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి లో జరిగిన బిసి డిక్లరేషన్ లో గొల్ల కురుమలకు గత ప్రభుత్వం గొర్లు పంపిణీ చేయకుండా డీడీలు కట్టించుకుని గొర్రెలు పంపిణీ చేయకుండా మోసం చేసింది మేము అధికారంలోకి వస్తే గొల్ల కురుమల అందరికీ ద్వారా గొర్ల పంపిణీ అమలు చేస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత గొర్ల పంపిణీ కోసం కట్టిన డిడిలను వాపస్ చేసి గొల్ల కురుమలను మోసం చేసిందని ఆయన ధ్వజమెత్తారు.

సంగం జిల్లా ఉపాధ్యక్షులు బండారి నారాయణ మాట్లాడుతూ.. గొర్లు మేకలకు సంవత్సరానికి మూడుసార్లు నట్టల మందులు పంపిణీ చేస్తామని చెప్పి 20 నెలల నుండి నట్టల మందులు పంపిణీ చేయడం లేదని అలాగే వివిధ రోగాలకు వస్తున్నా మందులు కూడా పంపిణీ చేయడం లేదని ఆయన అన్నారు ప్రభుత్వం వెంటనే గొర్ల పంపిణీ నగదు బదిలీ ద్వారా అమలు చేయాలని నట్టల మందులు తో పాటు ఇతర మందులను కూడా వెంటనే ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే గొల్ల కురుమలను సమీకరించి ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల* కార్యదర్శి గంట్రకోటి కుమార్. పగిడిపండ్ల సాంబయ్య. భాష బోయిన అనిల్. అజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -