రాహుల్ గాంధీకి పోస్టు కార్డులతో ఉద్యమకారుల విజ్ఞప్తి
నవతెలంగాణ – పాలకుర్తి
ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యమకారుల ఫోరం జిల్లా అర్హత కమిటీ చైర్మన్ గుగులోతు దేవ్ సింగ్ (రాములు) నాయక్ అన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గ కన్వీనర్ సంఘీ వెంకన్న ఆధ్వర్యంలో రాహుల్ గాంధీకి పోస్టుకార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకారుల కు అండగా ఉంటామని, పెన్షన్ తో పాటు 20050 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులను అందజేసి ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రకటించిందని తెలిపారు.
20 నెలలు గడుస్తున్నప్పటికీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఉచిత రైల్వే ప్రయాణాన్ని కల్పించాలని, 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం, 25 వేల పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు ఎడవెల్లి దండయ్య. కమ్మగాని రమేష్. మార్కండేయ, బోరెడ్డి మల్లారెడ్డి. సింగా మహేందర్ రాజు, ఎడవెల్లి కొమరుమల్లు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES