Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'పప్పీ షేమ్‌..' సందడి షురూ

‘పప్పీ షేమ్‌..’ సందడి షురూ

- Advertisement -

‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ చిత్రంతో హీరో రామ్‌ పోతినేని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహేష్‌బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. ఫస్ట్‌ సింగిల్‌ ‘నువ్వుంటే చాలే’తో హీరో రామ్‌ తన పెన్‌ పవర్‌ చూపించారు.
ఈ పాట బిగ్గెస్ట్‌ మ్యూజిక్‌ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు సెకండ్‌ సింగిల్‌ ‘పప్పీ షేమ్‌..’ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. రామ్‌ పోతినేని హై-ఆక్టేన్‌ వోకల్స్‌, అద్భుతమైన స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఈ పాటకి హైలెట్‌గా నిలిచింది. వివేక్‌, మెర్విన్‌ స్వరపరిచిన ఈ ట్రాక్‌, ఎనర్జిటిక్‌ బీట్స్‌తో యూత్‌ అండ్‌ ఫెస్టివల్‌ వైబ్‌ను సష్టిస్తుంది. ఈ పాట రామ్‌, అతని గ్యాంగ్‌ తమ అభిమాన స్టార్‌ చిత్రం విజయంపై ఆనందిస్తున్నప్పుడు, పందెం ఓడిపోయిన యాంటీ-ఫ్యాన్స్‌ను ట్రోల్‌ చేస్తున్న మూమెంట్‌ని ప్రజెంట్‌ చేస్తోంది. భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్‌తో వినోదాన్ని, అభిమానుల జ్ఞాపకాలను అద్భుతంగా అందించారు. ఈ ట్రాక్‌ ముఖ్యంగా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో మ్యాడ్‌ నెస్‌ని ప్రజెంట్‌ చేసింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్స్‌ హీరోయిన్‌గా నటించగా, సూపర్‌స్టార్‌గా ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. నవంబర్‌ 28న సినిమా రిలీజ్‌ కానుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad