Sunday, December 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజమ్మకు జననీరాజనం.!

రాజమ్మకు జననీరాజనం.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్షిన సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిసిన కొండ రాజమ్మకు జననిరాజనం పడుతున్నారు. ముఖ్యంగా యూత్, మహిళ, వృద్ధులు ఇలా అన్ని వర్గాల ప్రజలు రాజమ్మ వెంటే మేము అంటున్నారు. రాజమ్మకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామనీ గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉప సర్పంచ్ గా, జెడ్పిటిసిగా ప్రజలకు సేవలందించిన, అభివృద్ధి పనులు చేసిన అపారమైన అనుభవం రాజమ్మది. ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని ఈ నెల 17న తన ఉంగరం గుర్తుకు ఓటువేసి భారీ  మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాను గెలిసిన వెంటనే రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహకారంతో గ్రామానికి భారీగా నిధులు తీసుకొచ్చి కొయ్యుర్ గ్రామాన్ని అద్దంలా అభివృద్ధి చేసి, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందేలా చూస్తామని కొండ రాజమ్మ-సమ్మయ్య  దంపతులు ప్రజలకు హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -