భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
నవతెలంగాణ-భద్రాచలం
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతూ, తగ్గుతూ దోబూచులాడుతుంది. ఆదివారం మధ్యాహ్నానికి 37 అడుగులకు చేరిన నీటిమట్టం క్రమంగా తగ్గుతూ రాత్రి 8 గంటల సమయానికి 36 అడుగులకు చేరుకుంది. శనివారం రాత్రి 30 అడుగుల నుంచి క్రమంగా పెరుగుతున్న గోదావరి ఆదివారం మధ్యాహ్నం వరకు పెరుగుతూ ప్రజల్లో ఆందోళనను రేకెత్తించింది. అల్పపీడ ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయి అన్న వాతావరణ అధికారులు హెచ్చరికతో సోమవారం సాయంత్రం వరకూ గోదావరి పెరిగే అవకాశం ఉందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయిస్తారన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకు సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం లోతట్టు ప్రాంత ప్రజలకు సెప్టెంబర్ గండం ఇంకా పొంచే ఉందని తెలుస్తుంది. ఇప్పటికే స్నానాల ఘట్టం ముని గిపోగా యాత్రికులను గోదారి స్నానాలకు అధికారులు అనుమతిచ్చడం లేదు.
దోబూచులాడుతున్న గోదావరి…!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES