Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ ఆక్రోశ సభకు తరలి వెళ్లిన శ్రేణులు

బీసీ ఆక్రోశ సభకు తరలి వెళ్లిన శ్రేణులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కామారెడ్డిలో 42శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన  బీసీ ఆక్రోశ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు మెరుగు నాగేశ్వరరావు, గుర్రం నరేష్ ఆధ్వర్యంలో అమీర్ నగర్, నర్సాపూర్, కోన సముందర్, చౌట్ పల్లి గ్రామాల నుండి పలుకుల సంఘాలు యువజన సంఘాల సభ్యులు ప్రత్యేక వాహనాల్లో కామారెడ్డి బీసీ ఆక్రోశ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు గుర్రం నరేష్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టకుండా బిజెపిపై, బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్న బిఆర్ఎస్ పై, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల అమలు వైఫల్యాల మోసాలపై 42శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో బీసీ ఆక్రోశ సభను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -