Friday, December 12, 2025
E-PAPER
Homeజిల్లాలుకల్వకుంట్ల కంచుకోటపై ఎగిరిన ఎర్రజెండా..

కల్వకుంట్ల కంచుకోటపై ఎగిరిన ఎర్రజెండా..

- Advertisement -

గ్రామం ఏర్పడిన నాటి నుంచి ఏడుసార్లు సీపీఐ(ఎం) సర్పంచులు గెలుపొందారు
గ్రామ సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) చేసిన పోరాటం ప్రజలలో శిరస్మరణీయం
సమస్యల పరిష్కారం కోసం జైలు జీవితాలను ఎదుర్కొన్న సీపీఐ(ఎం) నాయకులు
ప్రజా సమస్యల పరిష్కారమే సీపీఐ(ఎం) లక్ష్యం అంటూ సీపీఐ(ఎం) జెండాను మోస్తున్న నేటితరం యువత..
నవతెలంగాణ – మునుగోడు
 
భూమికోసం , భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసిన ఎర్రజెండా ఎక్కడ ఉన్నది అని అంటున్న ఈ రోజుల్లో కూడా మునుగోడు మండలం కల్వకుంట్ల కంచుకోటపై మరోసారి సీపీఐ(ఎం) జెండాను మరోసారి ఎదలకు అద్దుకొని ఎర్రజెండాను ఎగరేశారు కల్వకుంట్ల గ్రామ ప్రజలు. దీంతో కల్వకుంట్ల గ్రామం కమ్యూనిస్టులకు కంచుకోట అనే చెదరని ముద్రను వేసుకున్నది. మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో కల్వకుంట్ల గ్రామానికి సర్పంచ్ అభ్యర్థికి ఎస్సీ మహిళా రిజర్వేషన్ రావడంతో ఆ గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ కామ్రేడ్ సింగపంగా ఎల్లయ్య సతీమణిని లక్ష్మమ్మ ను బీఆర్ఎస్, ధర్మసమాజ్ పార్టీ బలపరిచి బరిలోకి దించారు. ప్రత్యర్థి సింగపంగా రాణమ్మ పై 23 ఓట్ల మెజార్టీతో ఘన విజయంలో సాధించి ఎర్ర జెండాకు వన్నెతెచ్చారు.

గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీపీఐ(ఎం) సమరశీల పోరాటాలు నిర్వహించింది
మునుగోడు మండలంలో కల్వకుంట్ల గ్రామ సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) అనేక పోరాటాలను నిర్వహించి, ప్రజలకు అవసరమైన సమస్యలను పరిష్కరించడంలో సీపీఐ(ఎం) చరిత్ర గ్రామంలో చెదరని ముద్రగ ఉన్నందున ప్రజలు నేటికీ ఎర్రజెండా పక్షాన ఉంటున్నారు. కల్వకుంట్ల గ్రామంలో వెట్టి చాకిరిని తరిమికొట్టేందుకు కూలి సంఘాలను పెట్టి కూలీలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించే గొంతుగా ఉద్యమాలను నిర్వహించి పనికి తగ్గ వేతనం అందించాలని పోరాటం నిర్వహిస్తూనే, కూలి సంఘాలకు పక్షాన ప్రజలు నిలబడ్డారు.

పటేల్ పట్వారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి నిరుపేద ప్రజలకు బంజారా, పోడు భూములకు పేద ప్రజలకు అందించాలని అనేక పోరాటాలు చేసి భూములను పంచిన చరిత్ర సీపీఐ(ఎం)కు దక్కింది. పేద ప్రజలు కూడు, గూడు లేక గోసపడుతున్న సమయంలో ఎర్రజెండా పేద ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించి రైతుల వద్ద పట్టా భూములను కొని పేదలకు ఇండ్ల పట్టాలను అందించడంతోపాటు ఇండ్లు కట్టించడంలో సీపీఐ(ఎం) పాత్ర కీలకం. గ్రామానికి వచ్చేందుకు రహదారులు లేక అవస్థలు పడుతున్న ప్రజలకు రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీపీఐ(ఎం) అనేక ఉద్యమాలకు పురుడు పోస్తే గ్రామానికి రోడ్ల నిర్మాణం జరిగింది.

ఈ పోరాటాలలో ఎంతోమంది సీపీఐ(ఎం) నాయకులు ప్రజల కోసం జైలు జీవితాలను సైతం ఎదుర్కొన్నారు. అదే ఉద్యమ స్ఫూర్తితో గ్రామంలోని యువత సీపీఐ(ఎం) పక్షాన నిలబడుతూ.. గ్రామానికి ఇంకా కావలసిన సౌకర్యాల పైన అనేక ఉద్యమాలను నిర్వహిస్తూ సీపీఐ(ఎం) జెండాను వారి భుజాలపై మోస్తున్నారు. రాబోయే కాలంలో కూడా ప్రజా సమస్యల పరిష్కారమే సీపీఐ(ఎం) లక్ష్యంగా పనిచేస్తుంది.

కల్వకుంట్ల గ్రామంలో సీపీఐ(ఎం) ఏడుసార్లు గెలిచిన చరిత్ర ..
చండూరు మండలంలోని కొండాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కల్వకుంట్ల 1981లో గ్రామాల విభజనలో భాగంగా మునుగోడు మండలంలో నూతన గ్రామపంచాయతీగా ఏర్పడిన నాటినుండి నేటి వరకు ఆ గ్రామానికి 8సార్లు సర్పంచ్ ఎన్నికలు జరగగా.. ఏడుసార్లు సర్పంచ్ ఎన్నికలలో సీపీఐ(ఎం) ఎర్రజెండాను ఎగరవేసింది. మొదటిసారి, రెండవసారి జరిగిన సర్పంచ్ ఎన్నికలలో బొందు రాములు గెలుపొందారు.

మూడవ సారి జరిగిన ఎన్నికలలో బొందు పెద్ద నరసింహ, నాలుగవసారి జరిగిన ఎన్నికలలో బొందు పెద్ద నరసింహ సతీమణి నాగమ్మ గెలుపొందారు. ఐదవ సారి సింగపంగ గౌరయ్య గెలుపొందారు. ఆరవసారి కాంగ్రెస్ నుండి అబ్బన బోయిన మణెమ్మ గెలుపొందారు. ఏడోసారి పగిళ్ల భిక్షమయ్య గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎనిమిదవ ఎన్నికలలో సింగపంగా లక్ష్మమ్మ గెలుపొందారు. సర్పంచ్ తో పాటు బిఆర్ఎస్, ధర్మసమాజ్ పార్టీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో గెలుపొందిన స్థానాలు వార్డు సభ్యులు రెండవ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి మేక మాధవి ప్రదీప్ రెడ్డి, ఆరో వార్డు సీపీఐ(ఎం) అభ్యర్థి అయితగోని యాదయ్య, ఏడవ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి మేక ప్రత్యూష నవీన్ రెడ్డి గెలుపొందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -