Wednesday, October 29, 2025
E-PAPER
Homeజిల్లాలుఅలుగుపారిన బల్మూరు రెడ్డ చెరువు

అలుగుపారిన బల్మూరు రెడ్డ చెరువు

- Advertisement -

– పరిస్థితులను సమీక్షించిన ఎమ్మెల్యే 
నవతెలంగాణ – బల్మూరు

గత రెండు రోజులుగా ఆగకుండా విస్తారంగా కురుస్తున్న మొంతు తుఫానుకు ఉధృతంగా నీరు పొంగి పొర్లుతుండడంతో రహదారులు జలదిగ్బంధం అయ్యాయి. దీంతో బుధవారం ఆయా గ్రామాలలో ప్రధాన రహదారులపై రాకపోకలు నిలిచాయి. ఈ నేపథ్యంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ వరద ప్రాంతాలకు రాలేని పరిస్థితిలో పరిస్థితిలను కార్యకర్తలు అక్కడున్న నాయకులను అడిగి ఫోనులో వీడియో కాల్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు.

మండల కేంద్రంతోపాటు మండలంలోని మైలారం అంబగిరి, పోలిశెట్టిపల్లి, గోధల్, తుమ్మెన పేట, మంగళ కుంటపల్లి, జినుకుంట, పోలేపల్లి, వంటి గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. మండల కేంద్రం నుండి అటు అచ్చంపేట ఇటు లింగాల ప్రధాన రహదారి వెంట రాకపోకలు ఆగాయి. బల్మూరు కల్వర్టు వద్ద రెడ్డ చెరువు అలుగు పారుతుండడంతో బుధవారం రోజు మొత్తానికే రాకపోకలు నిలిచాయి. ఆయా గ్రామాలలో వరి పైరులు పూర్తిగా నీటిపాలై నేలకొరిగాయి. రెడ్డ చెరువు సమీపన వ్యవసాయ పొలంలో పక్కనే నివాసం ఉంటున్న బల్మూరు గ్రామానికి చెందిన బోట్క బాలయ్య పూరిగుడిసె నీట మునిగింది. ఆ రైతు గేదెలు, పశువులు ఇంటిలోని సామాగ్రి నీట మునిగాయని రైతు వాపోయాడు. గ్రామ యువకులు అతనికి సహకారం అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -