Friday, July 4, 2025
E-PAPER
Homeసినిమాఈసారి రిలీజ్‌ డేేట్‌ మారదు

ఈసారి రిలీజ్‌ డేేట్‌ మారదు

- Advertisement -

పవన్‌ కళ్యాణ్‌ చారిత్రక యోధుడిగా నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఎ. దయాకర్‌ రావు నిర్మిస్తున్న ఈ పీరియాడికల్‌ డ్రామాకు ఎ.ఎం.జ్యోతి కష్ణ, క్రిష్‌ జాగర్లమూడి దర్శకులు. ఈనెల 24న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని రిలీజ్‌ చేసింది.
గురువారం హైదరాబాద్‌లోని విమల్‌ -1థియేటర్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అలాగే అభిమానుల కోసం దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో ట్రైలర్‌ను ప్రదర్శించారు.
సమర్పకులు, నిర్మాత ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ,’చరిత్రను గుర్తుచేసే సినిమా ఇది. పవన్‌ కళ్యాణ్‌ చేసిన పూర్తిస్థాయి పాన్‌ ఇండియా యాక్షన్‌ చిత్రమిది. మీ ఆనందం చూస్తుంటేనే.. ట్రైలర్‌ మీ అంచనాలకు మించి ఉందని అర్థమవుతోంది. సినిమా కూడా ఇంతకుమించి ఉంటుంది. ఈ చిత్రం ఇంత అద్భుతంగా రావడానికి నా కుమారుడు జ్యోతికష్ణ ఎంతగానో శ్రమించాడు. ఇప్పటిదాకా మీరు పవర్‌ స్టార్‌ను చూశారు. ఈ సినిమాలో రియల్‌ స్టార్‌ను చూస్తారు. పవన్‌ కళ్యాణ్‌ సినీ జీవితంలోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్‌ హీరో’ అని అన్నారు
‘ఇది ట్రైలర్‌ మాత్రమే. అసలు సినిమా ఈనెల 24న వస్తుంది. ఆరోజు అసలైన పండుగ జరుపుకోబోతున్నాం. సినిమా అద్భుతంగా వచ్చింది. పవన్‌ కళ్యాణ్‌ హదయంలోనుంచి వచ్చే మాటలను ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుంది’ అని నిర్మాత ఎ.దయాకర్‌ రావు చెప్పారు.
దర్శకుడు జ్యోతి కష్ణ మాట్లాడుతూ, ‘కొందరు సినిమా గురించి అసత్య ప్రచారాలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. మా పని మేము చేసుకుంటూనే ఉన్నాము. ఇండియా మొత్తం తిరిగి చూసేలా ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాతో భారీ విజయం సాధించబోతున్నాం. ఈ సినిమాకి పునాది వేసిన క్రిష్‌కి ధన్యవాదాలు. అలాగే తన విలువైన సమయాన్ని కేటాయించి, మాకు అండగా నిలిచిన త్రివిక్రమ్‌కి కతజ్ఞతలు. ఈసారి డేట్‌ మారదు.. ఇండిస్టీ రికార్డులు మారతాయి’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -