- Advertisement -
మరో రూ.5వేలు ప్రియం
న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరల మోత కొనసాగుతూనే ఉంది. బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.5,130 ఎగిసి రూ.1,67,230కు చేరింది. 22 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన పసిడి రూ.4,700 ప్రియమై రూ.1,53,300గా నమోదయ్యింది. కిలో వెండిపై రూ.10,000 పెరిగి రూ.3.80 లక్షలకు చేరింది. దీంతో 10 గ్రాముల వెండి ధర రూ.3800గా నమోదయ్యింది. ట్రంప్ టారిఫ్ ఉన్మాదానికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి రికార్డ్ పతనం పసిడి, వెండి ధరలకు ఆజ్యం పోస్తున్నాయని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
- Advertisement -



