Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పనుల భాద్యత మీది.. నిధుల భాద్యత నాది: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

పనుల భాద్యత మీది.. నిధుల భాద్యత నాది: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

- Advertisement -

చెరువు కట్టల పటిష్టతపై తక్షణం సర్వే చేయండి
పంటల నష్టంపై సమగ్ర సమాచారం ఇవ్వండి
ఒక్క విద్యుత్ ప్రమాదం కూడా జరగకుండా చూడండి
జడ్చర్ల పట్టణ రోడ్లపై వర్షపు నీళ్లు నిలువకుండా చేయండి
మరో ఇరవై ఏళ్లపాటు ఇబ్బంది లేకుండా ప్రణాళికలు వేయండి
నవతెలంగాణ – జడ్చర్ల
మరో వారం పదిరోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నేపథ్యంలో నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చెరువుల కట్టలు బలహీనపడి తెగిపోయే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే తన దృష్టికి తీసుకురావాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కోరారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. జడ్చర్ల పట్టణంలో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోకుండా మరో 20 ఏళ్ల వరకూ సరిపోయే ప్రణాళికలు రూపొందించాలని మున్సిపల్ అధికారులను కోరారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను తనకు తక్షణం తెలియజేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ, రెవెన్యూ, మున్సిపల్, ప్రజారోగ్య శాఖల అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగానే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా నియోజకవర్గంలోని అన్ని చెరువులు నిండి అలుగులు పారుతున్నాయని, అయితే ఈ వర్షాలు మరి కొన్ని రోజులు కొనసాగితే బలహీనమైన చెరువు కట్టలు తెగిపోయి నీరంతా వృధాగా వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. అందుకే ఇరిగేషన్ శాఖ అధికారులు వెంటనే అన్ని చెరువు కట్టల పటిష్టతను సర్వే చేసి ఎక్కడైనా చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న అధికారులందరూ ఒక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి అందులో తనను కూడా చేర్చాలని, భారీ వర్షాల నేపథ్యంలో వారికి ఏ సమస్యలు ఉన్నా ఈ గ్రూపు ద్వారా తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడానికి తాను వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

జడ్చర్ల పట్టణ పరిధిలో ఉన్న నల్లచెరువు, నల్లకుంట, ఊరచెరువు తదితర చెరువులకు నీళ్లు ప్రవహించే ఛానల్స్ ను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీడర్ ఛానల్స్ ఆక్రమణలకు గురైన చోట వాటిని వెడల్పు చేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని, చెరువుల్లోకి నీళ్లు సాఫీగా వెళ్లిపోయేలా చూడాలన్నారు. జడ్చర్ల పట్టణంలో రహదారులపై నీల్లు నిల్వకుండా ఉండటానికి 20 ఏళ్లకు సరిపోయేలా పనులను ప్రతిపాదించాలని సూచించారు. పనులను మీరు ప్రతిపాదిస్తే అవసరమైన నిధులను తాను తీసుకొస్తానని ఆయన అధికారులకు హామీ ఇచ్చారు. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఎక్కడైనా ఎవరైనా ప్లాటింగ్ చేస్తే నిర్మొహమాటంగా వాటిని తొలగించాలని ఆదేశించారు.

పట్టణాల పరిధిలోనే ఇలాంటివి జరుగుతున్నాయని అధికారులు చెప్పగా ఎక్కడైనా సరే అలాంటి ఆక్రమణలను తొలగించాల్సిందేనని, ఎవరు చేసినా అలాంటి పనులకు తాను ఎన్నడూ మద్దతు ఇవ్వనని స్పష్టం చేసారు. కాగా నియోజకవర్గంలో విద్యుత్ ప్రమాదాల కారణంగా ఎవరూ బలి కాకుండా చూడాలని, ఒక్క విద్యుత్ ప్రమాదం కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడటం కోసం రూ.11 కోట్లతో సేఫ్టీ బడ్జెట్ ను ప్రభుత్వానికి పంపామని, ఆ నిధులు త్వరగా వచ్చేలా చూడాలని అధికారులు కోరగా, ఈ విషయం గురించి తక్షణ చర్యలు తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి విద్యుత్ శాఖ సీఎండీని ఫోన్ లో కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే నియోజకవర్గంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను  ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని వ్యవసాయ అధికారులను అనిరుధ్ రెడ్డి ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad