నవతెలంగాణ – కంది : మండల కేంద్రంలోని మామిడిపల్లి ,వడ్డెనగూడ తండా పరిధిలో గల సర్వే నంబర్ 12,385,382,381,360,359,358,357,356,355,354,353,352,351,342 నంబర్ల గుండా ప్రభుత్వ నక్షబాట గొలుసు తోవ కలదు. అట్టినక్షబాట సర్వేనెంబర్ 312 నుంచి 355 వరకు రైతులు వారి పొలాలంలోకి ఆ దారిని వాడుకుంటున్నారు. అందులో ఏ రైతు కబ్జాలో లేదు. కానీ సర్వే నంబర్ 354 నుండి 342 వరకు ప్రభుత్వ నక్షబాట కబ్జాకు గురి కావడం బాధాకరం. ఇట్టి కబ్జాకు గురి అయిన సర్వే నంబర్ 354 నుంచి 342 సర్వే నెంబర్ వరకు గల రైతులు వాళ్ళ పొలాలకు వెళ్లడానికి దారి లేక గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడతావున్నారు. ఈ విషయమై రైతులంతా దాదాపు రెండు సంవత్సరాలుగా కంది మండల తహసీల్దార్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చిన సమస్య పరిష్కారం కావడం లేదని ఆయా గ్రామల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులందరూ మంగళవారం ఆందోళన చెందుతూ కబ్జాకు గురైన బాట దగ్గర బైఠాయించి నిరసన తెలుపడం జరిగింది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి కబ్జాకు గురి అయినటువంటి ప్రభుత్వ నక్ష బాటను సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల పొలాల్లోకి వెళ్ళే దారి కబ్జాకు గురి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES