- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతుంది. కోతులు విపరీతమై గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను బెదిరిస్తూ గాయపరుస్తూ హడలెత్తిస్తున్నాయి. స్కూలు పిల్లలు, మహిళలు, రైతులు, కూలీలు రోజువారీ పనుల్లోకి వెళ్లాలంటే భయం భయంగా వెళుతున్నారు. కోతులు పిల్లలపై, పెద్దల పై, వృద్ధుల పై దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. వీటి గాయాలకు గురైన ప్రజలు మూడు రోజులకు ఒకసారి టీకాలు తీసుకోవడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ భుజాల నొప్పులతో వాపులతో బాధపడుతున్నారు. అధికారులు స్పందించి కోతుల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -