Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeసినిమాదేశిరాజు పాత్ర నా కోసమే రాశారు

దేశిరాజు పాత్ర నా కోసమే రాశారు

- Advertisement -

అనుష్క శెట్టి మోస్ట్‌ ఎవైటెడ్‌ యాక్షన్‌ డ్రామా ‘ఘాటీ’. విక్రమ్‌ ప్రభు మేల్‌ లీడ్‌గా నటించిన
ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్‌ 5న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.
ఈ నేపథ్యంలో నటుడు విక్రమ్‌ ప్రభు శనివారం మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
డైరెక్టర్‌ క్రిష్‌ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యా. కథ చెప్పడానికి ముందు ‘ఘాటీ’ వరల్డ్‌ ఎలా ఉంటుందో చూపించారు. అలాగే నన్ను ఈ రోల్‌కు ఎందుకు సెలెక్ట్‌ చేశారో అనే విషయం గురించి అరగంటసేపు చాలా క్లియర్‌గా వివరించారు. హైదరాబాద్‌లో నాకున్న ఫ్యాన్‌ బేస్‌ గురించి చెప్పారు. నా గత సినిమాల్లోని చాలా సీన్స్‌ గురించి చెబుతూ.. నిన్ను దష్టిలో పెట్టుకునే ‘దేశిరాజు’ క్యారెక్టర్‌ రాశానని చెప్పారు. ఆ మాట నాకెంతో సంతోషాన్నిచ్చింది. తర్వాత నా క్యారెక్టర్‌ గురించి ప్రెజెంటేషన్‌ ఇచ్చి స్టోరీ చెప్పారు. స్క్రిప్ట్‌ విన్నాక చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇందులో నా ఫేవరెట్‌ యాక్టర్‌ అనుష్క ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆమె అద్భుతంగా నటించారు.
‘ దేశిరాజు’ క్యారెక్టర్‌ నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది. ఇందులో నా పాత్ర మాట్లాడే భాష ఛాలెంజింగ్‌గా అనిపించింది.
యాక్షన్‌ సీన్స్‌ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఎంజారు చేస్తూ చేశా. యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణలో డీఓపీ పాత్ర ఇందులో చాలా కీలకం. డీఓపీ మనోజ్‌ యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ పర్సన్‌. మిగతా సినిమాల్లో కంటే ఇందులో ఫైట్స్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.
నటీనటులు ఎంతగా పర్ఫార్మ్‌ చేసినా.. డీఓపీ ఎంత అద్భుత దశ్యాలు చిత్రీ కరించినా వాటికి జీవం పోసేది సంగీతమే. అలాంటి అద్భుతమైన సంగీతాన్ని సాగర్‌ అందించారు. అది మీరు థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు కచ్చి తంగా ఫీల్‌ అవుతారు. ఈ సినిమా నిర్మాతలతో కలిసి పని చేయడం చాలా కంఫర్ట్‌ అనిపించింది. ఎంతో ప్యాషన్‌ ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు చేయ డానికి ముందుకు రాలేరు. ఇలాంటి నిర్మాతలు చేసిన సినిమాతో నేను తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad