మాజీమంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ – బాల్కొండ
ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర చాలా కీలకమని ప్రజల సమస్యలను పత్రిక ద్వారా వెలుగులోకి తేవాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నవతెలంగాణ 2026 క్యాలెండర్, డైరీలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. “అనుదినం జనస్వరం” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రజల సమస్యలను నిరంతరం ప్రతిబింబిస్తూ, ప్రజాపక్షంగా పనిచేస్తున్న దినపత్రిక నవతెలంగాణ అని ప్రశంసించారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ.. సామాన్యుల గొంతుకగా నిలుస్తూ వార్తలను నిర్భయంగా వెలుగులోకి తీసుకొస్తున్న నవతెలంగాణ పాత్ర అభినందనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడే విధంగా పత్రిక చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెలికి తీసి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బద్ధం ప్రవీణ్ రెడ్డి, నాయకులు సాగర్ యాదవ్, గాండ్ల రాజేష్,బద్దం నర్సారెడ్డి,సయ్యద్ ఫయాజ్, చిన్న బాల్ రాజేశ్వర్, కన్నా పోశెట్టి, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.



