నవతెలంగాణ-మద్నూర్: అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని వెలిగించేది గురువేనని, గురువులను పూజించేవారుగా విద్యార్థులు ఉండాలని ప్రిన్సిపాల్ నందాల గంగాకిశోర్, ప్రముఖ పద్య కవి సంస్కృతోపన్యాసకలు వెంకట్ లు పేర్కొన్నారు. తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం, జూనియర్ కళాశాలలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్ర,నేటి సమాజంలో గురువుల పాత్ర అనే అంశ అంశములపై వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ సాహిత్యపోటీలను నిర్వహించారు. సమాజములో గురువు పాత్ర చాలా కీలకమైనదని అన్నారు.సమాజమును చైతన్యపరిచే ఒక్క గురువేనని అన్నారు.విద్యార్థులు గురువులపట్ల ప్రేమను కలిగి ఉండాలని అన్నారు.గురువందనమ్విద్యార్థులు గురువులకు సన్మానమును చేశారు. పద్యకవి డా. బి వెంకట్,అధ్యాపకులు రాము,నరహరి,సుమన్,గణేశ్,వేణుగోపాల్,గంగాప్రసాద్ లతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

