Monday, December 15, 2025
E-PAPER
Homeజాతీయంమ‌రోసారి రూపాయి భారీగా ప‌త‌నం

మ‌రోసారి రూపాయి భారీగా ప‌త‌నం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఏన్డేయే పాల‌న‌లో మారోసారి రూపాయి నేల‌చూపులు చూసింది. క‌నిష్టంలో క‌నిష్టంగా 91 పైస‌ల‌కు ప‌డిపోయింది. ప్ర‌స్తుతానికి రూపాయిని US డాలర్‌తో పోలిస్తే 90.904 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడే గరిష్ట స్థాయి 90.957, ఇది 91 కంటే కొంచెం తక్కువగా ఉంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు, భారత కరెన్సీ సంచిత ప్రాతిపదికన 5 శాతానికి పైగా క్షీణించింది.

అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడంతో పాటు విదేశీ పెట్టుబడుల భారీ ఉపసంహరణలు, వాణిజ్య లోటు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.ముఖ్యంగా యూఎస్‌తో ట్రేడ్ డీల్ లేకపోవడం, పెర్సిస్టెంట్ ఔట్‌ఫ్లోస్ కారణంగా ఆసియాలోనే అత్యంత బలహీన కరెన్సీగా రూపాయి నిలిచింది. ఈ ఏడాది రూ.5.5 శాతం నుంచి 6 శాతం వరకు రూపాయి విలువ కోల్పోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -