పాలకుర్తి సీఐ జానకిరామ్ రెడ్డి
కొవ్వొత్తులతో పోలీస్ అమరులకు నివాళులు
నవతెలంగాణ-పాలకుర్తి
పోలీస్ అమరుల ప్రాణత్యాగాలు చిరస్మరణీయమని పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరుల వారోత్సవాల్లో భాగంగా పాలకుర్తి ఎస్సై దూలం పవన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ గేటు ముందు ఏర్పాటు చేసిన పోలీస్ అమరుల ఫ్లెక్సీ వద్ద, రాజీవ్ చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ జానకిరామ్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసుల ధైర్య సాహసం మరువలేనిదన్నారు.
విధినిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రువులతో పోరాడి శాంతిభద్రతల కోసం ప్రాణ త్యాగాలు చేసిన పోలీసుల ప్రాణ త్యాగాలను మరువకూడదని సూచించారు. పోలీసు అమరుల ప్రాణ త్యాగాల స్ఫూర్తితో శాంతిభద్రతలను కాపాడటంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రజల సేవకోసం తమ ప్రాణాలను ఆర్చించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించారు.
ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నీజాయితీతో పనిచేయాల్సి ఉంటుందని పోలీసులకు సూచించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, ఎల్లప్పుడు మన గుండెల్లోనే ఉంటారని తెలిపారు. పోలీసు అమరులు మన మధ్య లేనకున్నా మనం వారిని స్మరిస్తునే ఉంటామని తెలిపారు. అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన భాధ్యత మనందరిపై ఉందని సూచించారు. పోలీసు వారోత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి రెండవ ఎస్ ఐ మేకల లింగారెడ్డి, దేవరుప్పుల ఎస్సై యు. సృజన్ కుమార్, పోలీస్ సిబ్బంది, రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.
పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES