Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ అమరుల త్యాగాలు ఎప్పటికి చిరస్మరణీయం: కలెక్టర్

పోలీస్ అమరుల త్యాగాలు ఎప్పటికి చిరస్మరణీయం: కలెక్టర్

- Advertisement -

పోలీసు అమరవీరుల త్యాగాలే స్ఫూర్తిగా ప్రజా సేవకు పునరాంకితం అవుతాం: జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు 
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

దేశ రక్షణ, శాంతి భద్రతల కోసం విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు ఎప్పటికి చిరస్మరణీయం అని జిల్లా కలెక్టర్‌  బి.ఏం.సంతోష్ అన్నారు. మంగళవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే) కు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా పోలీస్  అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్‌ అనంతరం  జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ  టి శ్రీనివాస రావు తో కలిసి  పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 191 మంది పోలీస్ ఆమరవీరుల పేర్లను జిల్లా అదనపు ఎస్పీ కె . శంకర్   చదివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్,  జిల్ల ఎస్పీ, ఆలంపూర్ ఎంఎల్ఏ కె.విజయుడు,  జిల్లా అదనపు ఎస్పీ, జిల్లా గ్రంధాలయ చెర్మన్ నీలీ శ్రీనివాసులు, డి. ఎస్పీ మొగిలయ్య, సాయుధ దళా డి. ఎస్పీ నరేందర్ రావు, గద్వాల్, ఆలంపూర్, శాంతి నగర్ సీఐ లు,  ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐలు , పోలీస్ అధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాగుచ్చాలు వుంచి నివాళులు అర్పించారు. ఆర్ఐ వెంకటేష్  సారధ్యంలో సాయుధ పోలీసుల ‘శోక్ శ్రస్త్’ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సంద్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ..  దేశరక్షణలో శాంతి భద్రతల లోసమాజ సంరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరుల త్యాగాలు ఎప్పటికి చిరస్మరణీయం అని, వారి త్యాగాలకు గుర్తుగా ఈ రోజు వారిని స్మరించుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ అమరుల త్యాగాలను కొనియాడారు. దేశ రక్షణలో, అంతర్గత భద్రతలో పోలీసులు  అన్నీ రకాల సవాళ్లను ఎదుర్కోవడం లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, అలాగే ప్రజలను చైతన్య పరచడం లోని ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు ఆని అన్నారు. పోలీస్ సేవల వల్లే సమాజం లో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో స్వేచ్చగా జీవిస్తున్నారని అన్నారు. 

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ  దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన పోలీస్ అమారుల త్యాగాలు వెళ్ళకట్టలేనివి అని అన్నారు. భారత్ చైనా సరిహద్దులోని అక్సాయ్ చిన్ ప్రాంతంలో 16వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డ కట్టే మంచు పర్వతాల మద్యన ఉన్న వేడి నీటి బుగ్గ (హాట్ స్ప్రింగ్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిందనీ, మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దుల్లో భారత భూ బాగలైన లడక్, సిచియన్ ప్రాంతాలు కీలకమైన సరిహద్దు ల్లో  1959 అక్టోబరు 21న డి. ఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుoడగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూ బాగాన్ని ఆక్రమించెందుకు ప్రయత్నించడం తో CRPF దళం హాట్ స్ప్రింగ్  ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. 

భారత జవాన్ల రక్తం తో తడిచిన హాట్ స్ప్రింగ్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలం గా రూపు దిద్దుకుందని, అప్పటి నుండి ప్రజా రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగనిరతిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నామన్నారు. ఇలా ప్రతీ సంవత్సరం దేశం కోసం ఎంతో మంది జవాన్లు తమ ప్రాణాలను అర్పించారన్నారు. విధి నిర్వహణలో భాగంగా ఈ సంవత్సరం  191 మంది వీరయోధులు మృతి చెందారన్నారు. మన రాష్ట్రo లో గతంలో కూడా తీవ్రవాదుల చేతుల్లో వ్యాస్, 

కృష్ణప్రసాద్, పరదేశీనాయుడు, ఉమేశ్ చంద్ర తో పాటు ఎందరో సంఘ విద్రోహ శక్తుల తో చేసిన పోరాటంలో అమరులు అయ్యారన్నారు, ప్రతి పోలీస్ తన కుటుంబ సంతోషాలను వదులుకొని కుటుంబ సభ్యులతో హాయిగా జరుపుకోకుండా ప్రజల  రక్షణగా  రోడ్డుపై విధులు  నిర్వహిస్తూ  ప్రజల సంతోషాన్ని తన సంతోషంగా భావించి విధులు నిర్వహిస్తారని, వారికి అండగా నిలబడిన కుటుంబ సభ్యులకు ముఖ్యoగా పోలీస్  కుటుంబాలకు ధన్యవాదాలు తెలియజేశారు.  పోలీసులు  సమాజం కోసం, భవిష్యత్తు తరాల కోసం, ప్రజా రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని, ప్రజాశ్రేయస్సు, శాంతి భద్రతలే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు.

ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసులు తమ ప్రాణాలను ఎదురొడ్డి విధులు నిర్వహిస్తున్నారని, పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరమని అన్నారు. పోలీసులు పడుతున్న కష్టాన్ని శ్రమను గుర్తిస్తే వారికి అదే సంతోషం ఇస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అమరులైన వారి ఆశయాలను కొనసాగిస్తూనే వారి స్ఫూర్తిగా విధుల్లో రాణిస్తూ ప్రజలకు సేవలు అందిస్తామని అన్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఓపెన్ హౌస్ లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ విభాగాల  స్టాల్ ను ప్రారంభించి  మాదక ద్రవ్యాల నివారణ యూనిట్, భరోసా, షి టీం, సైబర్ క్రైమ్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాఫిక్, ఆయుధ ప్రదర్శన, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్టాల్ లను పరిశీలించారు.

చివరగా 3 రోజుల క్రితం నిజామాబాద్ లో రౌడీ షీటర్ దాడి లో అమరుడు అయిన ప్రమోద్ కుమార్ కుటుంబానికి  రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన తిమ్మప్ప తన వంతు ఆర్థిక చేయూత గా 50 వేల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కు అందజేశారు. పోలీస్ త్యాగాలను గుర్తించి అమరుడు అయిన ప్రమోదు కుటుంబానికి స్వచ్చందంగా 50 వేల రూపాయల చెక్ ను అందజేసిన తిమ్మప్ప ను జిల్లా అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏ ఓ సతీష్ కుమార్,ఎస్బి ఇన్స్పెక్టర్ రవి, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, పి సి ఆర్ ఇన్స్పెక్టర్ సంపత్, ఆలంపూర్, గద్వాల్, శాంతి నగర్ సిఐ లు రవి బాబు, శ్రీనివాస్, టాటా బాబు, జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు, అన్ని విభాగాల అధికారులు,సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -